Pushpa: ‘పుష్ప’ తొలి గీతం.. రికార్డు ఇదే..! - telugu news pushpa first single youtube record allu arjun rashmika sukumar devi sri prasad
close
Published : 25/08/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa: ‘పుష్ప’ తొలి గీతం.. రికార్డు ఇదే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని చిత్ర బృందం ఆగస్టు 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ‘దాక్కో దాక్కో మేక’, కన్నడలో ‘జొక్కే జొక్కే మేకే’, తమిళంలో ‘ఒడు ఒడు ఆడు’, మలయాళంలో ‘ఒడు ఒడు ఆడే’, హిందీలో ‘జాగో జాగో బక్రే’ అంటూ ఈ గీతం సాగుతుంది. ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని విశేషంగా అలరించి, యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో తెలుగు పాట మొదటి స్థానంలో నిలవగా కన్నడ పాట 9వ స్థానంలో, తమిళ వెర్షన్‌ 11వ స్థానంలో, మలయాళం వెర్షన్‌ 17వ స్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది చిత్రబృందం. ‘‘యూట్యూబ్‌లో పుష్ప’ తొలిగీతం.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఆల్‌ టైమ్‌ రికార్డుగా నిలిచింది’ అని పేర్కొంది.

అన్ని భాషల్లోనూ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాట తెలుగు వెర్షన్‌ చంద్రబోస్‌ రాశారు. శివమ్‌ ఆలపించారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగాన్ని క్రిస్మస్‌కి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని