RakulPreet Singh: ఓబులమ్మగా రకుల్‌ లుక్‌ చూశారా - telugu news rakulpreet singh look from kondapolam out now
close
Published : 23/08/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RakulPreet Singh: ఓబులమ్మగా రకుల్‌ లుక్‌ చూశారా

హైదరాబాద్‌: అగ్రకథానాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొండపొలం’. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రకుల్‌ డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రను ఆమె పోషించారు. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రకుల్‌ లుక్‌ని తెలియజేస్తూ ఓ స్పెషల్‌ వీడియో, పోస్టర్‌ని షేర్‌ చేసింది.

అటవీ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలియజేస్తూ వచ్చిన ఓ ప్రముఖ నవలను ఆధారంగా చేసుకుని ‘కొండపొలం’ తెరకెక్కిస్తున్నారు. గొర్రెల కాపరులు.. వాళ్లు పడుతున్న కష్టాలను ఇందులో చూపించనున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని