TDP: ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఆందోళన ఉద్రిక్తం - telugu news tdp protest at ap dgp office
close
Published : 17/09/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TDP: ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఆందోళన ఉద్రిక్తం

మంగళగిరి: పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మంగళగిరి డీజీపీ కార్యాలయంలో  ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెదేపా నేతలు, పోలీసు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారారెడ్డిని గౌరవంగా డీజీపీ కార్యాలయంలోకి ఆహ్వానించిన పోలీసు అధికారులు... తెదేపా ఎమ్మెల్యేలను రోడ్డుపైనే అడ్డుకున్నారని ఆరోపించారు.  వైకాపా ఎమ్మెల్యేకు ఇచ్చిన గౌరవం తమకూ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి తెదేపా శ్రేణులను అడ్డుకున్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తామని 24 గంటల ముందు ట్విటర్‌, వాట్సాప్‌లో ఎమ్మెల్యే ప్రకటించి కర్రలు, రాళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేస్తే పోలీసుల ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని