తమన్‌ అప్‌డేట్‌..‘వకీల్‌సాబ్’ గురించేనా? - thaman tweet creats new buz on vakeel sab
close
Published : 15/02/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్‌ అప్‌డేట్‌..‘వకీల్‌సాబ్’ గురించేనా?

హైదరాబాద్‌: సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ చేసిన ఒక ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘మార్చి 8న కలుద్దాం’ అంటూ ట్వీట్‌ చేసిన ఆయన ‘లెట్స్‌ ఇట్‌ మేక్‌ బిగ్‌ ఎగైన్‌’ అని రాసున్న ఒక ఫొటోను జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..మార్చి 8న మహిళా దినోత్సవం, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ సినిమా నేపథ్యం కూడా మహిళా ప్రాధాన్యమున్నదే. అందువల్ల ఖచ్చితంగా ఆ రోజున ‘వకీల్‌సాబ్‌’ చిత్రంలోని మరో పాటను ఆ రోజు విడుదల చేస్తారంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘మగువా..మగువా’ సాంగ్‌ ప్రేక్షకుల మదిని దోచింది. దీంతో త్వరలో వచ్చే మరో పాట కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్‌పై ఈ సాంగ్‌ ఉండొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 9వ తేదిన థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’వస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇవీ చదవండి!

చావుని ఎగతాళి చేస్తున్నారు: తాప్సీ

నిశ్చితార్థం తర్వాత పిల్లలు నాపై కోపంగా ఉన్నారు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని