Top Ten News @ 1 PM - top ten news at 1 pm
close
Updated : 01/06/2021 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. AP News: రఘురామ పిటిషన్‌ కొట్టేయండి: జగన్‌

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో కోర్టు ఆదేశించింది. దీంతో కౌంటర్‌ దాఖలు చేసిన జగన్‌.. బెయిల్‌ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును జగన్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona: ఇన్‌ఫెక్షన్‌ + టీకా = జీవితకాల రక్షణ

కొవిడ్‌-19 మహమ్మారి కట్టడిపై రెండు పరిశోధనలు సరికొత్త ఆశలు చిగురింపచేశాయి. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారు లేదా కరోనా టీకా తీసుకున్నవారికి ఈ వ్యాధి నుంచి జీవితకాల రక్షణ లభించొచ్చని అవి పేర్కొన్నాయి. అయితే మరోసారి ఆ ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఇవి పూర్తిస్థాయిలో కాపాడతాయని నిర్ధారణగా చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చన్న ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయని చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vaccine: 2 డోసులుగా వేర్వేరు వ్యాక్సిన్లు

3. Lockdown: అక్కడ మద్యం హోండెలివరీకి ఓకే

గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు దిల్లీ ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హోండెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టళ్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా బుకింగ్స్‌ స్వీకరించి నేరుగా ఇంటికే మద్యాన్ని చేరవేసేందుకు మద్యం దుకాణాదారులకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌ చట్టంలో సవరణలు చేసింది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజలు మద్యం దుకాణాల వద్ద గుమిగూడకుండా ఈ వెసులుబాటు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పాకిస్థాన్‌ నుంచి తెలుగు యువకుడి విడుదల

పాకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ విడుదలయ్యాడు. యువకుడిని పాక్‌ అధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. దీంతో ప్రశాంత్‌ ఈరోజు లేదా రేపు ఉదయం హైదరాబాద్‌ చేరుకోనున్నాడు. నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న ప్రశాంత్‌.. 2019లో తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పాక్‌ అధికారులకు చిక్కాడు. ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్‌ లేకుండా పాక్‌ భూభాగంలో అడుగుపెట్టడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘సైకిల్‌ గర్ల్‌’ జ్యోతి తండ్రి కన్నుమూత

5. అల‌రిస్తోన్న ‘జగమే తందిరం’ ట్రైల‌ర్‌

ధనుష్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజ్ తెర‌కెక్కిస్తోన్న‌ చిత్రం ‘జగమే తందిరం’. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి నాయిక‌. ఓటీటీ వేదిక‌గా ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌వుతోంది ఈ చిత్రం. జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్‌ విడుదలైంది. గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ధ‌నుష్ న‌ట‌న విశేషంగా ఆకట్టుకుంటోంది. మాస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అద‌ర‌గొట్టాడు.  యాక్ష‌న్ స‌న్నివేశాలు, నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Covid: అణ్వాయుధాల కంటే భారీ నష్టం చేసింది

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ పుట్టుక వెనుక నిజం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి విలయానికి చైనానే కారణమని, ఈ వైరస్‌ను ఆ దేశ శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన మహీంద్రా.. కొవిడ్‌ అణ్వాయుధాల కంటే భారీ నష్టం కలిగించిందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 3 వేల దిగువకు మరణాలు

7. Galwan valley: చైనా సైన్యాన్ని విమర్శించినందుకు..

దేశ సైనికులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కియు జిమింగ్‌ అనే బ్లాగర్‌ను చైనా ప్రభుత్వం జైల్లో వేసింది. ఈ విషయాన్ని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. అతడిని తొలుత అరెస్టు చేసి చైనా నేర చట్టాల కింద అభియోగాలను మోపింది. ఫిబ్రవరి 10న అతడు మైక్రోబ్లాగింగ్‌ ‘విబో’లో చైనా సైనికులను కించపర్చేలా  ఒక పోస్టు రాశాడు. అతడికి దాదాపు 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో వెంటనే చైనా అధికారులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహమ్మారి ధాటికి.. సొంతింట్లో కిరాయికి!

కరోనా.. ఆప్తులను దూరం చేస్తుంది. ఆస్తులను మాయం చేయిస్తుంది. మెదక్‌ జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం మియాపూర్‌కు వచ్చారు. 10-12 ఏళ్లుగా అక్కడే చిన్నహోటల్‌తో జీవనం ప్రారంభించారు. తాము కూడబెట్టిన రూ.15లక్షలకు మరో రూ.20 లక్షలు బ్యాంకు రుణం తీసుకుని ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. రెండోదశలో కరోనా నుంచి తప్పించుకోలేకపోయారు. ఏప్రిల్‌ నెలాఖరులో భార్య వైరస్‌ బారినపడ్డారు. ఏం చేయాలో పాలుపోని భర్త తన స్నేహితుడి వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకుని భార్యను ఆస్పత్రిలో చేర్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Sputnik: హైదరాబాద్‌కు చేరిన 30లక్షల డోసులు

దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో(జీహెచ్‌ఏసీ) వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ RU-9450 విమానం ఈ టీకాలు తీసుకుని మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటల ప్రాంతంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అందరిలో ఒకడు కాదు.. అతనొక్కడు!

152 మ్యాచ్‌లు.. 3176 పరుగులు.. ఒక శతకం, 16 అర్ధశతకాలు = 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు ఇవి చెప్పుకునేంత గొప్ప గణాంకాలేం కావు. అయినా అతడిని తక్కువ చేసి చూడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అతడు సహనానికి మారుపేరు. నిరీక్షణకు నిలువుటద్దం. అతడే టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌. 19 ఏళ్ల ప్రాయంలో జాతీయ జట్టులోకి వచ్చినా ఆటపై ఇష్టంతో ఇంకా కొనసాగుతున్నాడు. నేడు డీకే 36వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి ఆట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జడ్డూ..పాండ్య.. కుల్చా.. చీకటి వెలుగుల కథ!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని