ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌ - venu sriram gets emotional in vakeelsaab success meet
close
Published : 10/04/2021 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌

హైదరాబాద్‌: ‘వకీల్‌సాబ్‌’తో దర్శకుడిగా ఓ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్‌ వేణుశ్రీరామ్‌. పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్‌సాబ్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దీంతో చిత్రబృందం తాజాగా సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాతలతోపాటు చిత్రబృందంలోని ఇతర సభ్యులు ఇందులో పాల్గొన్నారు. కాగా, ‘వకీల్‌సాబ్‌’ విజయం పట్ల దర్శకుడు వేణుశ్రీరామ్‌ ఉద్వేగానికి గురయ్యారు. తాను ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తినని గుర్తు చేసుకున్న వేణు.. తన తండ్రి ఓ టైలర్‌ అని చెప్పారు. దర్శకుడిగా తాను ఉన్నతస్థాయికి చేరుకుంటే చూడాలని తన తండ్రి భావించారని.. కాకపోతే తన మొదటి సినిమా విడుదలైన సమయంలోనే ఆయన కన్నుమూశారని తెలిపారు. ఇప్పుడు తన తండ్రి ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారని చెబుతూ వేణు శ్రీరామ్‌ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడే ఉన్న దిల్‌రాజు ఇతరులు ఆయన్ని ఓదార్చారు.

పవన్‌ కమ్‌బ్యాక్‌ చిత్రంగా ‘వకీల్‌సాబ్‌’ విడుదలయ్యింది. ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించారు. మరోవైపు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వకీల్‌సాబ్‌’ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని