వార్నర్‌పై హీరోయిన్‌ అసహనం - warner anna what is this eesha rebba trolls david warner
close
Updated : 29/04/2021 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వార్నర్‌పై హీరోయిన్‌ అసహనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2021 ఉత్కంఠగా సాగుతోంది. ఆదివారం చెన్నై వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి వరకూ పోరాడి ఓడింది. అయితే.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవటంపై హైదరాబాద్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ జాబితాలో హీరోయిన్‌ ఈషారెబ్బ కూడా చేరింది. తన ఆవేదనను ట్విటర్‌ వేదికగా వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ వార్నర్‌ను ‘అన్నా’ అంటూనే ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘వార్నర్‌ అన్నా ఏంటిది..? బెయిర్‌స్టో, సుచిత్‌ను కాదని నువ్వెందుకు బ్యాటింగ్‌కు(సూపర్‌ ఓవర్‌లో) వెళ్లావ్‌..? నువ్వు ప్రయోగాలు చేయాలనుకుంటే డ్రీమ్‌11లో చేసుకో’’ అంటూ ఆమె సెటైర్‌తో కూడిన ట్వీట్‌ చేసింది.

కాగా.. దీనిపై క్రికెట్‌ అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం విలియమ్సన్‌తో పాటు వార్నర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. పైగా బౌలింగ్‌ చేస్తున్నది అక్షర్‌పటేల్‌.. కాబట్టి బంతిని నేరుగా బ్యాట్‌ మీదకు వస్తుందన్న ఆలోచనతో వార్నర్‌ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటాడ’ని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమందేమో ‘టెన్షన్‌ పడకు ఈషా..’ అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా.. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 159 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన హైదరాబాద్‌ కూడా సరిగ్గా 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఆ ఓవర్‌లో హైదరాబాద్‌ తరఫున విలియమ్సన్‌, వార్నర్‌ బ్యాటింగ్‌కు వచ్చారు. కేవలం 7 పరుగులు మాత్రమే చేయడంతో దిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. దీంతో సీజన్‌లో హైదరాబాద్‌ ఖాతాలో మరో ఓటమి వచ్చి చేరింది. హైదరాబాద్‌ ఇప్పటివరకూ 5 మ్యాచ్‌లాడి నాలుగింట్లో ఓడింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని