ప్రియుడితో తాప్సి ట్రిప్‌.. వీడియో వైరల్‌ - what did Pannus do in Maldives video goes viral
close
Published : 13/10/2020 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రియుడితో తాప్సి ట్రిప్‌.. వీడియో వైరల్‌

ముంబయి: దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ తాప్సి వారం రోజులుగా మాల్దీవుల్లో ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. సోదరి షాగున్‌, కజిన్‌ ఇవానియాతో కలిసి అక్కడికి వెళ్లిన ఆమె ఫొటోలు, వీడియోల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఆమె ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథియాస్ బో కూడా వారితో కలిసి అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. ఈ సందర్భంగా సరదాగా షూట్‌ చేసిన ఫన్నీ వీడియోను తాప్సి ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ‘మల్దీవుల్లో పన్నూస్‌ (ఇంటిపేరు) ఏం చేస్తున్నారు??’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. యశ్‌రాజ్‌ ముఖతే వైరల్‌ గీతం ‘బిగిని షూట్‌’కు వీరంతా డ్యాన్స్‌ చేశారు. మథియాస్‌ బో పుస్తకం చదువుకుంటూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

కళాకారుడు యశ్‌రాజ్‌ ఓ రియాల్టీ షోకు చెందిన వీడియోను తీసుకుని, దానికి సంగీతం జత చేసి పాటలా రూపొందించారు. అందులో వ్యాఖ్యాత ప్రవేశ్‌ రాణాతో మాట్లాడుతున్న క్రమంలో కంటెస్టెంట్‌ పూనమ్‌ ‘బికిని షూట్‌’ను ‘బిగిని షూట్‌’ అని ఉచ్ఛరిస్తారు. దాంతో అది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. ఆ గీతానికి తాప్సి ఇప్పుడు చిందేశారు. తాప్సి, మథియాస్‌ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇదే విషయాన్ని నటి  మీడియాతో చెప్పారు. తన కుటుంబ సభ్యులకు కూడా ప్రియుడి విషయం తెలుసని వివరించారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని