వింటేజ్‌ యువీ: 4 బంతుల్లో 4 సిక్సర్లు - yuvi is back in india legends
close
Published : 13/03/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వింటేజ్‌ యువీ: 4 బంతుల్లో 4 సిక్సర్లు

దక్షిణాఫ్రికా లెజెండ్స్‌పై ఇండియా లెజెండ్స్‌ విజయం

(Twitter)

రాయ్‌పుర్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి అభిమానులను మురిపించాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీసులో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచులో అదరగొట్టాడు. మునుపటి యువీని చూపించాడు. కేవలం 22 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2 బౌండరీలు, 6 కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు.

డిబ్రూన్‌ వేసిన 18వ ఓవర్లో యువీ విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా 0, 6, 6, 6, 6, 0తో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. మొత్తంగా తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లతో చెలరేగాడు. అంతకు ముందు సచిన్‌ తెందూల్కర్‌ (60; 37 బంతుల్లో 9×4, 1×6), బద్రీనాథ్‌ (42; 34 బంతుల్లో 4×4, 2×6) దుమ్మురేపారు. వరుస బౌండరీలతో హోరెత్తించారు. యూసుఫ్ పఠాన్‌ (23; 10 బంతుల్లో 2×4, 2×6), గోనీ (16*; 9 బంతుల్లో 1×6) అలరించాడు. దాంతో ఇండియా లెజెండ్స్‌ 3 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

ఈ పోరులో దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ 56 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇండియా లెజెండ్స్‌ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆండ్రూ పుటిక్‌ (41; 35 బంతుల్లో 6×4), మోర్న్‌ వాన్‌ విక్‌ (48; 35 బంతుల్లో 4×4) తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే పుటిక్‌ను యూసుఫ్‌, విక్‌ను ఓజా ఔట్‌ చేసి భారత్‌ను పోటీలోకి తెచ్చారు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడంలో విఫలమ్యారు. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేశారు. యూసుఫ్ పఠాన్‌ 3, యువీ 2 వికెట్లు తీశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని