వ్యక్తిగత కారణాలతోనే వైదొలగారు: ఆర్సీబీ - zampa richardson withdraw from ipl due to personal reasons rcb
close
Published : 26/04/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యక్తిగత కారణాలతోనే వైదొలగారు: ఆర్సీబీ

అహ్మదాబాద్‌: ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌లు వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంఛైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తెలిపింది. రాజస్థాన్‌ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్ర్యూ టై లీగ్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.

‘ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌లు వ్యక్తిగత కారణాలతోనే ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. తర్వాతి మ్యాచ్‌లకు వారు అందుబాటులో ఉండరు. వారికి మా పూర్తి సహకారం ఉంటుంది’ అని ఆర్సీబీ ప్రకటించింది.

లెగ్‌ స్పిన్నర్‌ జంపాను రూ.1.5కోట్లకు, రిచర్డ్‌సన్‌ను రూ.4కోట్లకు వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. రిచర్డ్‌ ఒక మ్యాచ్‌ ఆడగా, జంపా అది కూడా లేదు. ఇక ఆర్సీబీలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్‌ మ్యాక్‌వెల్‌, డాన్‌ క్రిస్టియన్‌, డేనియల్‌ సామ్స్‌ మాత్రమే ఉన్నారు. కాగా, లీగ్‌లో మొత్తం 14మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని