‘ఆదిపురుష్‌’ సంగీత దర్శకులు ఎవరంటే! - adipurush movie music composed by sachet tandon parampara thakur
close
Published : 08/06/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆదిపురుష్‌’ సంగీత దర్శకులు ఎవరంటే!

ఇంటర్నెట్‌ డెస్క్: ‘బాహుబలి’ హీరో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్‌ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ముంబయిలో ప్రారంభమైంది. అక్కడ కొంతమేర షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ రెండో దశతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసేది ఎవరనేది ఇప్పటి వరకు చిత్రబృందం చెప్పలేదు. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకులు సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు ఈ సినిమాకి పనిచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరు గతంలో ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రంలోని ‘‘సైకో సైయాన్’’ అనే పాటకి సంగీత స్వరాలు అందించారు. ఇంకా ‘ఏక్ ప్రేమ్ కథ’, ‘కబీర్ సింగ్’, ‘పతి పత్ని ఔర్‌ వో’, ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ వంటి బాలీవుడ్‌ చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ - మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఆదిపురుష్’లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. సినిమాకి కార్తిక్‌ పళని ఛాయగ్రాహకుడిగా పనిచేస్తుండగా ఎడిటర్లుగా అపూర్వ మోతివాలే, ఆశిష్‌ మాత్రేలు వ్యవహరిస్తున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్  పతాకంపై రూపొందుతున్న చిత్రానికి భూషణ్ కుమార్‌, కిషన్‌ కుమార్‌ నిర్మాతలు. రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న తెరపైకి రానుంది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని