
హైదరాబాద్: ‘ఇస్మార్ట్ శంకర్’, ‘మిస్టర్.మజ్ను’ చిత్రాలతో గతేడాది విజయాలు అందుకున్నారు నటి నిధి అగర్వాల్. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ చిన్నది బంపర్ ఆఫర్ కొట్టేసిందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలో కథానాయికగా ఎవరు కనిపించనున్నారనే విషయంపై కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం నిధిని సంప్రదించగా.. పవన్ సరసన నటించేందుకు ఆమె కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం 15 రోజుల షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- 2-1 కాదు 2-0!
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం