Cinema News: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అది - abijeet instagram chit chat with fans
close
Updated : 23/05/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అది

నెటిజన్లతో ముచ్చటించిన హీరో

హైదరాబాద్‌: ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమై తెలుగువారికి చేరువయ్యారు అభిజీత్‌. గతేడాది ఓ రియాల్టీ షోలో పాల్గొని విన్నర్‌గా నిలిచి అభిమానులకు మరింత దగ్గరయ్యారు. కాగా, చాలారోజుల తర్వాత అభిజీత్‌ ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. ఎంతోమంది నెటిజన్లు ప్రశ్నలు అడిగినప్పటికీ.. వాటిలో కొన్నింటికి చాలా సందర్భాల్లో సమాధానం ఇచ్చానని, అందుకే ఇప్పుడు మళ్లీ ఇవ్వలేదని ఆయన తెలిపారు.

అభి.. మీ అమ్మ ఎలా ఉన్నారు?

అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. అడిగినందుకు ధన్యవాదాలు. మా అమ్మకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పుడు మీ అందరూ మాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. మీరు మాపై చూపించిన ఆప్యాయత, అనురాగం మా మనస్సులను ఎంతగానో తాకింది. మరొక్కసారి మీ ప్రేమకు ధన్యవాదాలు.

మా ఇంట్లో వాళ్లందరికీ కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎక్కడా చూసినా భయాందోళనలకు గురి చేసే వార్తలే కనిపిస్తున్నాయి. నాకెంతో భయంగా అనిపిస్తుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ఏం చేయాలి?

నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. వారం క్రితం నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. ఇలాంటి సమయంలోనే మన మనస్సును మరింత పాజిటివ్‌గా మార్చుకోవాలి. సానుకూల ఆలోచనా విధానంతో జీవితం ఎలా మారుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక, వార్తల విషయానికి వస్తే వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ప్రజలదృష్టిని తమవైపు తిప్పుకునేందుకు కొంతమంది అలాంటి షాకింగ్‌ హెడ్డింగ్స్‌ పెడతారు. మీలోని ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకోండి.

జుట్టు ఊడిపోతుంది? ఏమైనా టిప్స్‌ ఇవ్వగలరు?

జుట్టు ఊడిపోవడం అనేది ప్రపంచమంతా ఉన్న సమస్య. ప్రొటీన్‌ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోండి. మంచి హెయిర్‌ ప్రొడెక్ట్స్‌ వాడండి.

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడం ఎలా?

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంటికే పరిమితమవడం వల్ల పాత జ్ఞాపకాలను ఎక్కువగా నెమరువేసుకుంటున్నాను.

బెంగళూరులోని అభిమానుల్ని ఎప్పుడు కలుస్తారు?

బెంగళూరు డేస్‌ని నేను ఎంతో మిస్‌ అవుతున్నాను. నా ఫ్రెండ్స్‌తో కలిసి నగరంలోని రోడ్లపై సిటీ షాపింగ్‌మాల్స్‌, ఇందిరానగర్‌లో సరదాగా గడిపేవాడిని. తప్పకుండా త్వరలోనే అక్కడికి వచ్చి అభిమానులను కలుస్తాను.

ఒకవేళ మీరు ఏమైనా కోరికలు కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు?

ప్రతిఒక్కరిలో మానవత్వం నిండాలి. మనతోపాటు భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కజీవి సమానంగా బతికేలా చూడాలి.

మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

చాలా ఉన్నాయి. కేవలం ఒక్క పని మాత్రమే చేస్తూ నేను బతకలేను.

ఒకవేళ మీకు కనిపించకుండా ఉండే అవకాశం వస్తే ఏం చేస్తారు?

యూఎస్‌లో ఉన్న ఏరియా 51కి వెళ్లి అసలు అక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అనేది తెలుసుకుంటా. ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాల్సి ఉంది.

మీ సినిమాల కోసం ఎదురుచూస్తున్నాం?బ్లాక్‌బస్టర్‌తో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలి.

తథాస్తు.

మీ కార్డ్‌ వివరాలు చెప్పగలరు?

100మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని