వాస్తవ ఘటనలతో ‘మరో ప్రస్థానం’ - Telugu News Tanish Starer Maro prastanam Trailer Out Now
close
Updated : 17/09/2021 08:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాస్తవ ఘటనలతో ‘మరో ప్రస్థానం’

తనీష్‌ హీరోగా దర్శకుడు జాని తెరకెక్కించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. ఉదయ్‌ కిరణ్‌ సమర్పణలో మిర్త్‌ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్‌ సేథీ కథానాయిక. రాజా రవీంద్ర, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 24న రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనీష్‌ మాట్లాడుతూ ‘‘అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. నటుడిగా నన్ను మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమవుతుంది. దీంట్లో వాస్తవ ఘటనలు, సమకాలీన సమస్యల్ని చూపిస్తున్నాం’’ అన్నారు. కార్యక్రమంలో ముస్కాన్‌ సేథీ, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని