Cinema News: ‘బ్యాక్‌ డోర్‌’లో ఏం జరిగింది? - telugu news Famous Director Raghavendra Rao Launched Back Door Trailer
close
Updated : 28/10/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘బ్యాక్‌ డోర్‌’లో ఏం జరిగింది?

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. కర్రి బాలాజీ తెరకెక్కించారు. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు  ఇటీవల చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చూశాను. చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంది. సినిమాకి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘ఓ ఆసక్తికర కథాంశంతో ఇది రూపొందింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకొని ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ అందుకుంది’’ అన్నారు దర్శక నిర్మాతలు. సంగీతం: ప్రణవ్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని