
‘క్రాక్’తో విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’తో బిజీగా గడుపుతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. జయంతీలాల్ గడ సమర్పిస్తున్నారు. మంగళవారం రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఖిలాడీ’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో రవితేజ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ‘‘యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. ప్లే స్మార్ట్... అనేది ఉపశీర్షిక. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ కథలో ఎత్తులు, పైఎత్తులు ఆకట్టుకునేలా ఉంటాయి. దక్షిణాదిలోని ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్- లక్ష్మణ్, అన్బు- అరివు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఒక మంచి సాంకేతిక బృందం కలిసి, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చిత్రాన్ని తీర్చిదిద్దుతోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. మాటలు: శ్రీకాంత్ విస్సా, సాగర్, సాహిత్యం: శ్రీమణి, కూర్పు: అమర్‌రెడ్డి, ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- రివ్యూ: పవర్ ప్లే
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- బీమా చేస్తున్నారు.. ప్రాణం తీస్తున్నారు!
- అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- పంత్ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడు
- నలుగురితో ప్రేమ.. లక్కీ డ్రా తీసి ఒకరితో పెళ్లి!
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- పంత్.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్