‘సలార్‌’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..? - glimpse of salaar launch prabhas prashanth neel vijay kiragandur hombale films
close
Published : 17/01/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సలార్‌’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?

హైదరాబాద్‌: భారతీయ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు చెక్‌ పడనుంది. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ కెప్టెన్‌ ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’ ప్రారంభమైంది. ఈ సినిమాకు శుక్రవారమే పూజా కార్యక్రమాలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాకింగ్‌ స్టార్‌ యశ్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశాడు. ఈ సందర్భంగా ప్రభాస్‌, యశ్‌ కలిసి ఉన్న ఫొటోలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తాజాగా.. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా.. ఆ వీడియోను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పూజా కార్యక్రమాన్నే ఇంత గొప్పగా తీర్చిదిద్దారంటే.. సినిమాను ఇంకెంత బాగా తీస్తారోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనుంది. ఇతర తారాగణం గురించి డైరెక్టర్‌ ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

ఇదీ చదవండి.. 

‘కేజీయఫ్‌2’ టీజర్‌పై అభ్యంతరం.. నోటీసులు
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని