#KGF2: రెండోది కూడా క్రిస్మస్‌కేనా? - gossips on kgf2 release date
close
Published : 01/07/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#KGF2: రెండోది కూడా క్రిస్మస్‌కేనా?

బెంగళూరు: కన్నడ హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ చేసిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ఒక రీజనల్‌ మూవీగా విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ -2’ రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఇప్పుడు ఈ సినిమా విడుదల కోసమే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్‌-2’ విడుదల గురించి సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్‌ 9న ‘కేజీఎఫ్‌-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఈ మేరకు చిత్రనిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారని సినీవర్గాల సమాచారం.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రిలీజ్‌ డేట్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా, అన్ని సక్రమంగా ఉంటే అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని.. అలా కాని పక్షంలో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు సినీవర్గాల భోగట్టా. ఒకవేళ అదే కనుక నిజమైతే అభిమానులు మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.  ‘కేజీఎఫ్‌-1’ సైతం 2018లో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 21న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని