Kota Factory 2: ఐఐటీలో సీటు కోసం మరోసారి కుస్తీ - kota factory 2 official trailer
close
Published : 10/09/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kota Factory 2: ఐఐటీలో సీటు కోసం మరోసారి కుస్తీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సిరీస్‌ల్లో ‘కోట ఫ్యాక్టరీ’ ఒకటి. విడుదలైన నాటి నుంచే మంచి టాక్‌ తెచ్చుకుంది. దీనికి కొనసాగింపుగా త్వరలోనే ‘సీజన్‌2’ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సీజన్‌-1లో ఐఐటీలో సీటు కోసం వైభవ్‌(మయూర్‌ మోర్‌) పడిన ఇబ్బందులను చూపించారు. ఇప్పుడు కథ మొత్తం మహేశ్వరి ఇనిస్టిట్యూట్‌ చుట్టూ తిరగనుంది. అక్కడ చేరిన వైభవ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో ఇందులో చూపించనున్నారు. సెప్టెంబరు 24వ తేదీ నుంచి ‘కోట ఫ్యాక్టరీ: సీజన్‌-2’ స్ట్రీమింగ్‌ కానుంది. సౌరభ్‌ కన్నా రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కు రాఘవ్‌ సుబ్బు దర్శకత్వం వహించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని