రివ్యూ: క్షణక్షణం
‘ఆటగదరా శివ’ చిత్రంతో తొలి అడుగులోనే ఓ వైవిధ్యభరిత కథాంశాన్ని రుచి చూపించి సినీప్రియుల దృష్టిని ఆకర్షించారు హీరో ఉదయ్ శంకర్. రెండో ప్రయత్నంగా ‘మిస్‌మ్యాచ్’తో పర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలోనే ఓ బలమైన విజయాన్ని అందుకునేందుకు ‘క్షణ క్షణం’ అనే థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆయన. కార్తీక్ మేడికొండ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రమిది. టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి విడుదలవుతున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? ఉదయ్‌కి విజయాన్ని అందించిందా?
కథేంటంటే: సత్య (ఉదయ్ శంకర్), ప్రీతి (జియా శర్మ) అనాథలు. ఇద్దరికీ ఒకానొక సందర్భంలో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి... పెళ్లి పీటలెక్కుతుంది. కానీ, పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఆ ప్రేమ కనుమరుగవుతుంది. డబ్బు విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు డబ్బు సంపాదన కోసం సత్య చేపల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా.. అక్కడా నష్టాలే ఎదురవుతాయి. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న అతని జీవితంలోకి అనుకోకుండా మాయా (శ్రుతిసింగ్) ప్రవేశిస్తుంది. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన ఈ పరిచయం వల్ల సత్య జీవితం ఊహించని సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి మాయా ఎవరు? ఆమె వల్ల సత్యకి ఎదరురైన సమస్యలేంటి? వాటి నుంచి అతనెలా బయటపడ్డాడన్నది మిగతా చిత్ర కథ.
ఎలా ఉందంటే: రెండు గంటల లోపే నిడివున్న చిన్న చిత్రమిది. విశాఖపట్టణం నేపథ్యంగా కథ సాగుతుంటుంది. ప్రధమార్ధంలో సత్య జీవితం ఏంటి? ప్రీతీ అతని జీవితంలోకి ఎలా వచ్చింది. వాళ్లిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? వంటి అంశాలను చూపిస్తూ.. ప్రేక్షకులను మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. తర్వాత సత్యకి ఓ డేటింగ్ యాప్‌లో మాయా పరిచయమవడం.. వాళ్లిద్దరి మధ్య నడిచే ఛాటింగ్‌తో కథలో మలుపు తిరుగుతుంది. మధ్యలో సత్య వ్యాపార జీవితానికి సంబంధించి వచ్చే సన్నివేశాలు.. ఆ నేపథ్యంగా సాగే సంభాషణలు అలరించేలా తీర్చిద్దాల్సింది. ఇక విరామ సమయానికి మాయా హత్యకు గురవడంతో ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు.
పోలీసులు మాయా హత్య కేసును విచారించే క్రమంతో కథనంలో వేగం పెరుగుతుంది. ఆ సమయంలో దర్శకుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కేసుల నుంచి బయటపడటానికి సత్య ఎలాంటి ఎత్తులు వేస్తాడు? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ, కథనాలు పరుగులు పెడతాయని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురువుతుంది. హత్య కేసు నుంచి బయట పడేందుకు హీరో చేసే ప్రయత్నాలు, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు చేసే పరిశోధనలతో సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ఆయా సన్నివేశాల్లో వచ్చే సంభాషణలు కూడా ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. పతాక సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
ఎవరెలా చేశారంటే: తొలి చిత్రం ‘ఆటగదరా శివ’తోనే మంచి నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందారు ఉదయ్ శంకర్. ఈ సినిమాలోనూ కథకు తగ్గట్లుగా తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిరాశ నిస్పృహల మధ్య భారంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న కుర్రాడిగా ఆయన నటన ఎంతో సహజంగా అనిపించింది. ఆయన భార్యగా జియా శర్మ పర్వాలేదనిపించింది. ద్వితీయార్ధంలో ఉదయ్, జియా పాత్రల్లో కనిపించే మరో కొత్త కోణం ప్రేక్షకులకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. మాయ పాత్రలో శ్రుతి సింగ్ అందాలు ఒలికించింది. తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా ప్రేక్షకులకు కావాల్సినంత కనుల విందు అందిస్తుంది. సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాష్, గిప్టన్.. తదితరులంతా పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు ఎంచుకున్న కథను ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. కథలో ట్విస్ట్‌లు బాగున్నా, వాటిని తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు. రోషన్ సాలూర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు పర్వాలేదనిపిస్తాయి.
బలాలు | బలహీనతలు |
+ ఉదయ్ శంకర్ నటన | - కథ.. కథనాలు సాగిన తీరు |
+ ద్వితీయార్ధం | - ప్రథమార్ధం, ముగింపు |
చివరిగా: ద్వితీయార్ధంలో ‘క్షణ క్షణం’ ఉత్కంఠే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘పంచతంత్రం’.. ఓ భావోద్వేగం
-
‘మేజర్’ కోసం ఆరు భారీ సెట్లు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
-
Radhe: మోస్ట్ వాంటెడ్ ట్రైలర్ వచ్చేసింది
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..