AlluArjun: 15రోజుల తర్వాత ఫ్యామిలీతో బన్నీ - alluarjun recoverd from covid
close
Published : 12/05/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AlluArjun: 15రోజుల తర్వాత ఫ్యామిలీతో బన్నీ

తండ్రిని చూసి మురిసిపోయిన అయాన్‌, అర్హ

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ 15 రోజుల తర్వాత తన పిల్లలను కలిశారు. ఇటీవల కొవిడ్‌-19 బారిన పడిన ఆయన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుని వైద్యులు సూచనలు పాటిస్తూ కోలుకున్నారు. ఇటీవల పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తన చిన్నారులు అయాన్‌, అర్హలకు కొన్నిరోజులు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నెగెటివ్‌గా నిర్ధారణ అయిన అనంతరం క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చారు. తన చిన్నారులను కలిశారు. వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోని అల్లు అర్జున్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

‘15 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించిన అనంతరం నాకు కొవిడ్‌-19 నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అభిమానులు, సన్నిహితులకు కృతజ్ఞతలు. కరోనా కేసులు తగ్గించడంలో ఈ లాక్‌డౌన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. మరోవైపు బన్నీకి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిసి ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని