ఇంటర్నెట్ డెస్క్: 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెలిచిన మానుషి చిల్లర్ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేయబోతోంది. ‘పృథ్వీరాజ్’ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జోడీగా ఆమె నటించింది. కాగా, దీపావళి కానుకగా నవంబర్ 5న ఆ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్లో అగ్రతారగా వెలుగొందుతున్న దీపిక పదుకొణె కూడా 2007లో దీపావళికి ‘ఓం శాంతి ఓం’తో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో దీపికకు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే.. దీపిక బాటలోనే మానుషి నడుస్తోందన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించింది.
‘దీపిక ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణగా నిలిచే నటి. ఆమెలా నేను కూడా దీపావళికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్నతనంలో దీపావళికి విడుదలయ్యే సినిమాలను థియేటర్‌కు వెళ్లి చూసిన రోజులు నాకు గుర్తున్నాయి. తొలి సినిమా అని ఎక్కువగా అంచనాలు పెట్టుకొని ఒత్తిడి గురికాను. ఎందుకంటే నా మొదటి చిత్రాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నా’ అని ఆమె పేర్కొంది. కాగా.. ఈ చిత్రానికి చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించారు. చారిత్రక నాటకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనూసూద్, సంజయ్‌దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’