ధనుష్ ‘జగమే తంత్రం’ టీజర్‌ చూశారా! - jagame thandhiram - telugu teaser
close
Published : 08/05/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధనుష్ ‘జగమే తంత్రం’ టీజర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్: ధనుష్‌ కథానాయకుడిగా కార్తిక్ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జగమే తందిరం’. తెలుగులో ఈ సినిమాని ‘జగమే తంత్రం’గా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తెలుగు టీజర్‌ ఒకటి విడుదలై అలరిస్తోంది. ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ధనుష్‌కు ఇది 40వ చిత్రం కావడం విశేషం. ఇందులో ఆయన సురాలి రాజన్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. కథానాయికగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది.  వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం స్వరాలు సమకూర్చగా  శ్రేయాస్‌ కృష్ణ కెమెరామెన్‌గా పనిచేశారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పాట ‘బుజ్జి’అనే విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గత ఏడాది మే 1న థియేటర్‌లో విడుదల కావాల్సింది. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనైనా విడుదల చేయాలని భావించారు. కానీ అదీ కుదరలేదు. చివరకు జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదల అవుతోంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని