close
Published : 18/04/2021 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Tumbbad 2: సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నాం!

ముంబయి: విమర్శకులను సైతం మెప్పించిన మైథలాజికల్ హారర్‌ ఫిల్మ్‌ ‘తుంబాద్‌’. ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే పని మొదలు పెట్టినట్లు నటుడు, నిర్మాత సోహమ్‌ షా తెలిపారు. 2018లో విడుదలైన ‘తుంబాద్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, రివ్యూల పరంగానూ మెప్పు పొందింది. దీనికి సీక్వెల్‌ ఉంటుందని గతంలోనే షా ప్రకటించారు. తాజాగా దీనిపై మాట్లాడుతూ.. ‘‘తుంబాద్‌’కు సీక్వెల్‌ చేయమని ఎన్నో విన్నపాలు వచ్చాయి. తప్పకుండా సినిమా చేస్తాం. కానీ, కేవలం డబ్బు, ప్రచారం కోసం సినిమా తీయను’ అని షా పేర్కొన్నారు.

‘‘తుంబాద్‌2’ విషయంలో అనే ఆలోచనలు ఉన్నాయి. అయితే, ఏదీ స్క్రీన్‌ప్లే స్థాయి వెళ్లలేదు. ఇప్పటికిప్పుడే సినిమా తీసి, డబ్బు చేసుకుందామన్న ఆలోచన లేదు. అదే సమయంలో ప్రజలు కూడా మర్చిపోతారన్న విచారమూ లేదు. మా బృందం సరైన ఆలోచనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక మంచి చిత్రం తీయడమే మా లక్ష్యం. సినిమా కార్యరూపం దాల్చడానికి ముందే కథపై మాకో స్పష్టత రావాలి’’ అని సోహమ్‌ షా తెలిపారు.

మహారాష్ట్రలోని తుంబాద్‌ గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో సినిమాలో చక్కగా చూపించారు. ‘తుంబాద్‌’ను ఆరేళ్ల పాటు తెరకెక్కించారు. అనేక సన్నివేశాలను రీషూట్‌ చేయాల్సి వచ్చింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని