close
Published : 03/03/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పునీత్‌ ‘పాఠశాల..’ సాంగ్‌ విడుదల!

హైదరాబాద్‌: శాండిల్‌వుడ్‌ పవర్‌స్టార్‌, అగ్ర కథానాయకుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ తొలిసారి తెలుగులో డైరెక్ట్‌ మూవీతో రానున్నారు. ‘యువరత్న’ పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని హోంబాలే సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘పాఠశాల..’అంటూ సాగుతున్న సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. విశాల్‌ మిశ్రా ఆలపించిన ఈ పాటకు సాహిత్యాన్ని కల్యాణచక్రవర్తి అందించారు. ఒక సందేశాత్మకత సాహిత్యంతో పాటు వినసొంపైన సంగీతంతో ‘పాఠశాల..’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఇందులోని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ సినిమాలకు భారీ ఓపెనింగ్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ఆయన నటనతో మెప్పిస్తూ, తన డ్యాన్సులతో యువతను ఉర్రుతలూగిస్తారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని