లొకేషన్‌లో సొహైల్‌ గొడవ.. ఎందుకంటే? - sohel serious on movie team
close
Published : 04/04/2021 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లొకేషన్‌లో సొహైల్‌ గొడవ.. ఎందుకంటే?

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో వెలుగులోకి వచ్చిన నటుడు సొహైల్‌. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా షూట్‌లో భాగంగా లొకేషన్‌కు చేరుకున్న సొహైల్‌ చిత్రబృందంలోని ఓ సభ్యుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవ కాస్తా చిన్నపాటి ఘర్షణకు దారి తీసింది. లొకేషన్‌లో ఉన్న సభ్యులు ఎంత చెప్పినా వినకుండా ఇద్దరూ పరస్పరం పెద్ద పెద్దగా కేకలు వేసుకున్నారు.

గొడవ వల్ల షాక్‌కు గురైన నిర్మాత.. తనకి ఇలాంటివి నచ్చవని.. కాబట్టి వెంటనే గొడవ ఆపాలని ఇద్దరికీ సూచించాడు. మరోవైపు హీరోయిన్‌ సైతం బిత్తరపోయింది. అయితే, ఇదంతా నిజం కాదని కేవలం ప్రాంక్‌ కోసం మాత్రమే గొడవపడ్డామని సొహైల్‌ తర్వాత చెప్పాడు. అంతేకాకుండా ఈ ప్రాంక్‌ గురించి నిర్మాతతోపాటు హీరోయిన్‌కీ తెలియదని ఆయన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని