సుమంత్ అక్కినేని
‘నేను నటించిన థ్రిల్లర్ సినిమాల్లో కపటధారి ప్రత్యేకమైంది’ అన్నారు సుమంత్ అక్కినేని. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నందిత శ్వేత నాయిక. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సుమంత్. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
* ‘మళ్లీరావా’ తర్వాత ప్రేమకథలే వస్తాయి అనుకున్నా కానీ ఎందుకో థ్రిల్లర్ అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని రొమాంటిక్ కథలు వచ్చినప్పటికీ అవి అంతగా నచ్చలేదు. త్వరలోనే ఓ లవ్‌స్టోరీ చేస్తాను. అయితే నేను ఇప్పటి వరకు చేసిన థ్రిల్లర్ చిత్రాల్లో ‘కపటధారి’ చాలాప్రత్యేకం.
ఎలా చిత్రీకరిస్తారో..!
మాతృక (కవలుధారి- కన్నడ) సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి వాటిని ఎలా చిత్రీకరిస్తారు అనిపించింది. వాటి వల్లే రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యాను. మాతృకతో పోలిస్తే తెలుగు స్ర్కీన్‌ప్లే కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. పోలీసు అధికారుల్ని తప్ప ట్రాఫిక్ పోలీసుల్ని మనం పెద్దగా పట్టించుకోం. రోజూ చూస్తున్నా వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించం. అలాంటి ఓ ట్రాఫిక్ ఎస్సై జీవిత కథే ఈ సినిమా. తన పైఅధికారులు వద్దని చెప్పినా ఓ కేసును ఛేదించేందుకు అతనేం చేస్తాడు? అనేది తెరపై చూడాల్సిందే.
ఆ సమస్య ఉండదు..
సినిమాలోని కొన్ని సీన్స్ డార్క్‌గా ఉంటాయి. నార్ ఫిల్మ్స్ అంటే కొంచెం డార్క్నెస్ ఉండాల్సిందే. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ రాలేదు. యూనివర్సల్ కథ ఇది. నేటివిటీ సమస్య రాదు. మాతృక రచయిత, దర్శకుడు హేమంత్ రావు సలహాలు అందించారు. అందుకు తగిన విధంగా కొన్ని మార్పులు చేశాం. ఈ సినిమా కోసం ఫిజిక్ మీద దృష్టి పెట్టాను. ఇందులో యాక్షన్ సహజంగా సాగుతుంది అంతేకానీ కమర్షియల్ చిత్రాల్లో ఉన్నట్టు ఉండదు. 2020 ఫిబ్రవరిలోనే చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో విడుదల చేయాలనుకున్నాం కరోనా కారణంగా వాయిదా పడింది.
తనకే ఎక్కువ మార్కులు..
ఇలాంటి కథలకు నేపథ్య సంగీతం బలంగా నిలుస్తుంది. సైమన్ కింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. సినిమా విడుదలయ్యాక అందరికంటే ఆయనకే ఎక్కువ మార్కులు వేస్తారు. మనిషి బయటకు ఒకలా కనిపిస్తాడు. లోపల మరోలా ఉంటాడు. అదే సినిమాలో కనిపిస్తుంది. కథకి సరిపోతుందనే ఈ పేరు పెట్టాం. ఇదే విషయాన్ని డైలాగుల్లోనూ ప్రస్తావించాం.
ధైర్యంతో ఓ ప్రేమకథ..
నేను పూర్తి కథ వినేందుకు ఆసక్తి చూపిస్తాను. వీలుకుదరని సందర్భాల్లో పూర్తి స్క్రిప్టు ఇవ్వమంటాను. కొన్నిసార్లు వాళ్లనే వినిపించమంటాను. నాకు సెట్ అయ్యే కథలే ఓకే చేస్తా. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పరిశ్రమలో పోటీ పెరిగింది. విభిన్న కథలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు నటిస్తోన్న ‘అనగనగా ఓ రౌడీ’ తర్వాత ఓ చక్కని ప్రేమ కథలో నటించనున్నా. ఇదొక సరికొత్త ప్రయోగం. ధైర్యంతో చేస్తున్నా.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’