Pelli SandaD: అలరిస్తోన్న ‘పెళ్లిసందడి’ టైటిల్‌ సాంగ్‌ - telugu news pelli sandadi movie title song roshan sree leela
close
Published : 12/08/2021 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pelli SandaD: అలరిస్తోన్న ‘పెళ్లిసందడి’ టైటిల్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోషన్‌, శ్రీలీల జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. టైటిల్‌ గీతాన్ని (లిరికల్‌ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. ‘పట్టుచీరల తళతళలు, పట్టగొలుసుల గలగలలు’ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం హుషారుగా సాగింది. పెళ్లిసందడి అంటే ఇదీ! అనేలా ఉంది. నాయకానాయికలతోపాటు చాలామంది సీనియర్‌ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేస్తున్నారు. రోషన్‌, శ్రీలీల డ్యాన్సు, కలర్‌ఫుల్‌ సెట్లు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. హేమచంద్ర, దీపు, రమ్య బెహర ఆలపించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రంతోనే నటుడిగా మారుతున్నారు. ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని