Karnataka: కన్నబిడ్డను రూ.5వేలకు అమ్మేసిన తల్లి - woman sold newborn for rs 5000 but now wants back
close
Published : 17/09/2021 21:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karnataka: కన్నబిడ్డను రూ.5వేలకు అమ్మేసిన తల్లి

ఇంటర్నెట్‌డెస్క్: కర్ణాటకలోని విజయపురలో ఓ మహిళ నవజాత శిశువును నర్సు ద్వారా 5 వేల రూపాయలకు అమ్మేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చి తన శిశువు కావాలని కోరింది. విషయం తెలిసిన అధికారులు నర్సును సస్పెండ్  చేయగా తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

విజయపుర జిల్లా తికోటకు చెందిన రేణుక ఆగస్టు 19న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పోషించే స్తోమత లేదంటూ కస్తూరి అనే నర్సు ద్వారా తన బిడ్డను ఆగస్టు 26న 5వేల రూపాయలకు విక్రయించింది. కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను తిరిగి ఇవ్వాలని రేణుక డిమాండ్ చేయగా, కుదరదని నర్సు తేల్చి చెప్పింది. రేణుక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు. రేణుకపై మూడు కేసులు నమోదు చేశారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని