close

తాజావార్తలు

ఎకానమీ క్లాస్‌లో స్టార్‌ హీరో..

సర్‌ప్రైజ్‌ అయిన ప్రయాణికులు

ముంబయి: సాధారణంగా సెలబ్రిటీలు బిజినెస్‌ క్లాస్‌లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే సందర్భాలు అరుదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. ఇండిగోకు చెందిన విమానంలో ప్రయాణికులకు ఓ సర్‌ప్రైజ్‌ ఎదురైంది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో నవ్వుతూ కూర్చున్నారు. ఆ సందర్భంలో ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ విరాల్‌ భయానీ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమిర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘ఆమిర్‌ భాయ్‌.. నువ్వు రియల్‌ హీరో’ అంటూ ఆయన్ను ప్రశంసించారు. త్వరలో ఆమిర్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే చిత్రంలో నటించబోతున్నారు. 

View this post on Instagram

#ripbusinessclass ?? #aamirkhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.