ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం

తాజా వార్తలు

Published : 29/08/2020 01:07 IST

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి. వీరి రాకను గమనించిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది పైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పుల్లో చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్‌ కొనసాగుతోందని, ఉగ్రవాదులు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే  వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని