Crime news: మదనపల్లె పారిశ్రామికవాడలో పేలుడు

తాజా వార్తలు

Updated : 08/06/2021 11:22 IST

Crime news: మదనపల్లె పారిశ్రామికవాడలో పేలుడు

ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

మదనపల్లి నేరవార్తలు: చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం పారిశ్రామికవాడలోని టీపీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. యూకలిప్టస్ ఆయిల్ నాణ్యతను పరిశీలించేందుకు వినియోగించే గ్యాస్ క్రోమాటోగ్రఫీ యంత్రం అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రమాదంలో బెంగళూరు నుంచి వచ్చిన టెక్నీషియన్‌ లింగప్ప(42) అక్కడికక్కడే మృతిచెందగా.. పరిశ్రమ యజమాని శివ మహేష్, అక్కడే పనిచేస్తున్న నయాజ్ బాషా(32) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నయీజ్‌ బాషాకు మెరుగైన చికిత్స అందించేందుకు తిరుపతి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే మండల రెండో పట్టణ సీఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి మాబు సుభాన్, బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని