close
Array ( ) 1

తాజా వార్తలు

ముఖానికి సంచి చుట్టుకొని.. నోట్లోకి ఆక్సిజన్‌ వదులుకొని..

 బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

జూబ్లీహిల్స్‌: పరీక్షల్లో తప్పాననే మనస్తాపంతో ఓ బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ముఖానికి ప్లాస్టిక్‌ సంచి చుట్టుకొని.. నోట్లో పైపుల ద్వారా ఆక్సిజన్‌ వదులుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని వినాయకనగర్‌కు చెందిన కురుమయ్య, రమణమ్మల కుమారుడు గణేశ్‌(19) బండ్లగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం గదిలో నుంచి వాసన వచ్చింది. దీంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా.. గణేశ్‌ మెడకు ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులు, ముఖానికి పాలిథిన్‌ కవరు ఉండి అపస్మారక స్థితిలో కనిపించాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు నెలల క్రితం గణేశ్‌ బీటెక్‌ రెండో సంవత్సరం పరీక్షలు తప్పడంతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మరోసారి పరీక్ష రాసినా ఫలితం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అతను అంతర్జాలంలో వివిధ ఆత్మహత్య పద్ధతులను అన్వేషించినట్లు గుర్తించారు. ఇంటికి ఆక్సిజన్‌ సిలిండర్‌ని తెచ్చాడని.. ఇదేమిటని చెల్లెలు అడగగా దాటవేసినట్లు పోలీసులు చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
VITEEE 2020
besttaxfiler
HITS2020
dr madhu
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన