AP News: వివేకా హ‌త్య‌కేసులో రెండో రోజు విచార‌ణ‌

తాజా వార్తలు

Updated : 08/06/2021 12:24 IST

AP News: వివేకా హ‌త్య‌కేసులో రెండో రోజు విచార‌ణ‌

క‌డ‌ప‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసులో రెండో రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా పని చేసిన‌ ఇద‌య‌తుల్లాను సీబీఐ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచార‌ణ జ‌రుగుతోంది.  ఇద‌య‌తుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని కూడా రెండో రోజూ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు.

దస్తగిరిని సోమవారం ఏడు గంట‌ల పాటు విచారించిన విష‌యం తెలిసిందే. ఆయన్ను నెల రోజులుగా సీబీఐ అధికారులు దిల్లీలో విచారించి ఇటీవలే కడపకు పంపించారు. తాజాగా మళ్లీ విచారణకు పిలిచారు. వివేకా హత్యకు సుమారు 6 నెలల ముందుగా ఎందుకు పని మానేయాల్సి వచ్చింది? ఆర్థిక లావాదేవీలు తదితర విషయాలపై దస్తగిరిని ప్రశ్నించినట్లు సమాచారం.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని