Crime: నడిరోడ్డుపై  వైద్య దంపతుల దారుణ హత్య

తాజా వార్తలు

Updated : 29/05/2021 10:43 IST

Crime: నడిరోడ్డుపై  వైద్య దంపతుల దారుణ హత్య

భరత్‌పూర్‌: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ డాక్టర్‌ దంపతులను అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ సందీప్‌ గుప్తా ఆయన భార్య డాక్టర్‌ సీమా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం తమ కారులో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌ వచ్చి అడ్డుకున్నారు. అనంతరం ఒక వ్యక్తి బైక్‌ దిగి నేరుగా కారు దగ్గరకు వెళ్లాడు. సందీప్‌ కారు అద్దాన్ని దించిన వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో ఆ దంపతులపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో అటుగా వెళ్తున్నవారు ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత నిందితులు దర్జాగా అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనంతా అక్కడి ట్రాఫిక్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

కాగా.. ప్రతీకారంతోనే సందీప్‌ దంపతుల హత్య జరిగినట్లు తెలుస్తోంది. 2019లో వీరిద్దరూ ఓ మహిళ హత్య కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. చనిపోయిన మహిళతో సందీప్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అప్పుడు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. దీంతో సందీప్‌, ఆయన భార్య సీమాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆ మహిళ సోదరుడే ఇప్పుడు సందీప్‌ దంపతులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని