Cyber Fraud: రూ.360 కోట్ల సైబర్‌ మోసం

తాజా వార్తలు

Published : 07/07/2021 01:26 IST

Cyber Fraud: రూ.360 కోట్ల సైబర్‌ మోసం

డెహ్రాడూన్‌: దేశంలో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్‌లకు చెందిన సైబర్ నేరగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం లాభాలను ఆశజూపి  భారతీయుల నుంచి ఏకంగా రూ.360 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో ఈ మోసం బయటపడింది. చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు ఓ మొబైల్ యాప్ రూపొందించారు. అందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన భారత్‌కు చెందిన అనేక మంది కోట్లాది రూపాయలను వీరు చెప్పిన ఖాతాలో జమ చేశారు. అలా చేరిన రూ.360 కోట్లను మోసగాళ్లు వివిధ ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా చైనాలోని బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. అక్కడి నుంచి ఈ సొమ్ము ‘పవర్‌ బ్యాంక్‌’ యాప్‌ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి చేరింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న మరికొన్ని యాప్‌లను దర్యాప్తు అధికారులు గుర్తించారు. 

హాంకాంగ్‌ నేరగాళ్లకు సహాయం అందించారనే ఆరోపణలతో దేశంలోని ఇ-వ్యాలెట్‌ పేటీఎం, రేజర్‌పే ప్రతినిధులకు ఉత్తరాఖండ్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరాఖండ్‌లో ఇద్దరు కీలక నిందితులు సహా బెంగళూరులో నలుగురు, దిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ మోసంలో విదేశీయుల హస్తం ఉండటంతో సీబీఐ, ఐబీ, ఈడీ వంటి జాతీయ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అవసరమైతే అంతర్జాతీయ సంస్థల సహాయం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని