Crime News: డమ్మీ తుపాకీతో ప్రజలను బెదిరిస్తున్న నకిలీ పోలీస్‌ అరెస్ట్

తాజా వార్తలు

Published : 24/09/2021 01:21 IST

Crime News: డమ్మీ తుపాకీతో ప్రజలను బెదిరిస్తున్న నకిలీ పోలీస్‌ అరెస్ట్

గుంటూరు: డమ్మీ తుపాకీతో జనాన్ని బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న నకిలీ పోలీస్ శివకృష్ణ నాయక్‌ను గుంటూరు అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి నకిలీ తుపాకీతో పాటు బైక్, కొంత నగదును స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన తులసీరామ్ అనే వ్యక్తి ఆటో కోసం ఎదురు చూస్తుండగా తాను పోలీసునంటూ శివకృష్ణ నాయక్ పరిచయం చేసుకున్నాడు. నీపై అనుమానం ఉందని, తనిఖీ చేయాలని నకిలీ తుపాకీతో బెదిరించాడు. అతని వద్ద 500 రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. బాధితుడు తులసీరాం ఫిర్యాదు మేరకు పోలీసులు శివకృష్ణనాయక్‌ను ఆరెస్ట్‌ చేశారు. నిందితుడు గతంలో పోలీసు ఉద్యోగంకోసం ప్రయత్నాలు చేయగా ఉద్యోగం రాకపోవడంతో పోలీసునని చెప్పుకుంటూ అమాయకుల వద్ద నగదు దోచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని