Guntur: టోల్‌ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Guntur: టోల్‌ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్‌ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీని క్యాష్‌ కౌంటర్‌ వద్ద ఆపి టోల్‌ రుసుము చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే మంటలు క్యాష్‌కౌంటర్లకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. లారీ డ్రైవర్‌ కూడా వాహనం నుంచి కిందకు దిగిపోవటంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు శకటాలతో మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు క్యాష్ కౌంటర్లు పూర్తిగా దగ్ధ మయ్యాయి. రూ.20లక్షల నష్టం వాటిల్లినట్టు టోల్‌గేట్‌ నిర్వాహకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం టోల్‌ప్లాజా నుంచి యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. 

 

 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని