ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

తాజా వార్తలు

Published : 03/05/2020 01:18 IST

ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి

బలర్షా: మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా జరవండీ పోలీసు స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సినబట్టి అటవీ ప్రాంతంలో సి-60 బెటాలియన్‌ కమాండోలకు, మావోయిస్టులకు జరిగిన ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా కమాండోలు సినబట్టి అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కమాండోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

సుమారు అరగంట పాటు సాగిన కాల్పుల్లో కమాండోల ఎదురుదాడి తీవ్రతరం చేయడంతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుని పరిశీలించిన పోలీసులకు మహిళా మావోయిస్టు మృతదేహం కన్పించింది. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ఆమె వివరాలపై ఆరా తీసేందుకు పరిశీలనకు జిల్లా కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలిలో ఆయుధాలను, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని జిల్లా ఎస్పీ శైలేష్‌ ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని