close

తాజా వార్తలు

Updated : 19/01/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది!

తీవ్రగాయాలతో మృతిచెందిన యువతి

పెనుమూరు: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన జి.గాయత్రి (20), పూతలపట్టు మండలం చింతమాకులపల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో గతనెల రెండో వారంలో ఇంటి నుంచి వెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. అనంతరం యువతి తండ్రి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమ జంటను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

యువతి తల్లిదండ్రుల వద్దే ఉంటానని చెప్పడంతో చేసేదేమీ లేక పోలీసులు వారిద్దర్నీ తిరిగి తమ ఇళ్లకు పంపించారు. దీంతో కక్ష పెంచుకున్న ఢిల్లీ బాబు.. మంగళవారం తన బంధువుల అమ్మాయితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న గాయత్రిని ఎంపరాళ్ల కొత్తూరు వద్ద అటకాయించాడు. కత్తులతో ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. హుటాహుటిన బంధువులు యువతిని పెనుమూరు పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలిస్తుండగా దారిలోనే గాయత్రి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. యువతి మృతి నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చింతమాకులపల్లిలోని ఢిల్లీబాబు ఇంటిపై దాడి చేసి ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. 

ఇవీ చదవండి..

ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్‌: లోకేశ్‌

కాటేసిన మరో కన్న తండ్రి.. అంతమయ్యాడు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని