close

తాజా వార్తలు

Updated : 23/01/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు

దెందులూరు: అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండల కొమిరేపల్లి బాధితుల సంఖ్య 29కి చేరింది. నిన్న 25 మంది అస్వస్థతకు గురికాగా.. తాజాగా మరో నలుగురు కళ్లు తిరగడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. వీరిలో ముగ్గురిని ఏలూరులోని వైద్యశాలకు తరలించారు. 

కొమిరేపల్లిలో గురువారం రాత్రి తొలి కేసు నమోదవగా, శుక్రవారం కొత్తగా 24 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 16, మహిళలు 9 మంది ఉన్నారు. వీరిలో 21 మంది కోలుకోగా నలుగురు చికిత్స పొందుతున్నారు. మూడు చోట్లా బాధితులందరిలోనూ కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయి. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు స్పష్టంచేశారు. 

ఏలూరులో డిసెంబర్‌ 4న మొదలైన అంతుచిక్కని వ్యాధి కలవరం దాదాపు రెండు వారాలపాటు కొనసాగింది. మొత్తం 622 మంది వరకు ఆస్పత్రిలో చేరారు. క్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే శుక్రవారం నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన ఒక బాలిక, తూర్పువీధికి చెందిన ఓ వృద్ధుడు ఇవే లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. 

ఇవీ చదవండి..
విస్తరిస్తున్న కలవరం!

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆలయాలపై దాడులు



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని