TS news: హైదరాబాద్‌ వైద్యుడికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

తాజా వార్తలు

Updated : 06/08/2021 05:26 IST

TS news: హైదరాబాద్‌ వైద్యుడికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు చిక్కుకున్నారు. ఔషధాల్లో కలిపే ఆయిల్‌ను విక్రయిస్తామంటూ మురళీ మోహన్‌రావు అనే వైద్యుడిని సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారు. అమెరికాలో ఆయిల్‌ వ్యాపారం చేస్తున్నామని నమ్మించి విడతల వారీగా డబ్బులు వసూలు చేసుకున్నారు. ఇలా వైద్యుడు రూ.11 కోట్లను సైబర్‌ నేరగాళ్ల అకౌంట్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత వాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని