Ts News: నాలాలో పడి ఏడేళ్ల‌ బాలుడి మృతి

తాజా వార్తలు

Updated : 05/06/2021 13:14 IST

Ts News: నాలాలో పడి ఏడేళ్ల‌ బాలుడి మృతి

హైదరాబాద్‌: నాలాలో పడిన‌ బాలుడు ఆనంద్‌సాయి(7) మృతి చెందిన ఘటన న్యూబోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఆనంద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఆనంద్‌నగర్‌ కల్వర్టు వద్ద ఉన్న నాలాకు అధికారులు ఈ ఉద‌యం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి.. గల్లంతయ్యాడు. వెంటనే స్పందించిన స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించ‌గా.. ఆనంద్‌సాయి మృత‌దేహం ల‌భ్య‌మైంది. చిన్నారి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని