కెనడాలో తెలంగాణ విద్యార్థి మృతి

తాజా వార్తలు

Published : 10/11/2020 01:42 IST

కెనడాలో తెలంగాణ విద్యార్థి మృతి

వనస్థలిపురం: కెనడా వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఫేజ్‌-4లో నివాసముంటున్న శ్రీకాంత్‌, హరిప్రియ దంపతుల కుమారుడైన  అఖిల్‌(19) గతేడాది హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ చేసేందుకు కెనడా వెళ్లాడు. కరోనాకు ముందు భారత్‌ వచ్చిన అఖిల్‌ తిరిగి అక్టోబర్‌ 5న కెనడాకు వెళ్లాడు. అక్కడ తను నివాసముంటున్న భవనంలోని 27వ అంతస్తుపై చరవాణిలో మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అఖిల్‌ మరణవార్తతో వనస్థలిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అఖిల్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అఖిల్‌ ఇద్దరి సంతానంలో రెండోవాడు. కుమారుడిమృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని