జలపాతాలు చూసి.. జలగర్భం పాలు!

ప్రధానాంశాలు

Updated : 15/09/2021 04:41 IST

జలపాతాలు చూసి.. జలగర్భం పాలు!

వార్ధా నదిలో పడవ బోల్తా పడి నలుగురి మృతి
మరో ఏడుగురి గల్లంతు
క్షేమంగా ఒడ్డుకు చేరిన ఇద్దరు
మహారాష్ట్ర అమరావతి జిల్లాలో దుర్ఘటన

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్ర అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గాడేగావ్‌ సమీపంలోని వార్దా నదిలో పడవ బోల్తా పడి మంగళవారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. గాడేగావ్‌ గ్రామానికి చెందిన 12 మంది వరూడ్‌ తాలుకాలోని జుంజ్‌లో సోమవారం జరిగిన బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చారు. మంగళవారం సమీపంలోని జలపాతాలు, వార్ధా నది ఒడ్డున గల జుంజు పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు పడవ ఎక్కారు. జలపాతాలు చూశాక తర్వాత.. ఆలయం వైపు వెళ్తున్న క్రమంలో ఉదయం 10.30 గంటలకు పడవ బోల్తా పడింది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ  ఒడ్డుకు చేరగా.. మిగతా వారు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన సహాయ సిబ్బంది ఓ చిన్నారి సహా నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు విస్తృతం చేశారు. పడవ సామర్థ్యానికి మించి(పడవ నడిపే వ్యక్తితో కలిపి 13 మంది) ప్రయాణికులు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే దేవేంద్ర భుయర్‌ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన