నవ వధువు ఆత్మహత్య

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 06:52 IST

నవ వధువు ఆత్మహత్య

భర్త వేధింపుల వల్లే అని బంధువుల ఫిర్యాదు

దివ్య

శివ్వంపేట, న్యూస్‌టుడే: వివాహమైన నెలరోజులకే భర్త వేధింపులు మొదలెట్టడంతో నూతన వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన శివ్వంపేట మండలం గోమారంలో చోటు చేసుకుంది. శివ్వంపేట ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపిన వివరాలు... మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మండలం వైఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన చోకట్‌వాల సరిత, నాగేశ్‌ దంపతులకు దివ్య (19), నవ్య కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె దివ్య అత్వెల్లికి చెందిన రోహిత్‌లు పరస్పరం ప్రేమించుకుని ఇంటినుంచి వెళ్లిపోయి నెల రోజుల కిందట వివాహం చేసుకున్నారు. అనంతరం పెద్దలు అంగీకరించడంతో వారు శివ్వంపేట మండలం గోమారంలోని తోటమాలిగా పనిచేసేందుకు ఇటీవల వచ్చారు. ఈ నేపథ్యంలో సరిగా పని చేయడం లేదంటూ రోహిత్‌ దివ్యను కొట్టి హింసించగా మనస్తాపం చెందిన ఆమె మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగింది. దీంతో అపస్మారక స్థితికి చేరిన దివ్యను వెంటనే నర్సాపూర్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతిచెందారు. దీంతో ఆమె మృతదేహాన్ని భర్త రోహిత్‌ తల్లిగారింటికి ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లగా వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డను రోహిత్‌ కొట్టి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని యువతి తాత సుమన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన