
ఎర్రన్నాయుడి సేవలను గుర్తుచేసుకున్న తెదేపా
అమరావతి: దివంగత తెదేపా నేత ఎర్రన్నాయుడి జయంతి సందర్భంగా ప్రజా జీవితంలో ఆయన సేవలను తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ప్రజా బంధువు స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎర్రన్నాయుడి పోరాట స్ఫూర్తి బీసీలతో పాటు బడుగు, బలహీన వర్గాల్లో కూడా ఉత్తేజం నింపిందన్నారు. ఎర్రన్నాయుడు అంటే కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతమన్నారు. పార్లమెంట్లో ఆంధ్రుల గంభీరవాణిగా విరాజిల్లారని కీర్తించారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు.
Tags :