తెదేపా నేత లోకేశ్‌పై కేసు నమోదు
logo
Published : 19/06/2021 17:12 IST

తెదేపా నేత లోకేశ్‌పై కేసు నమోదు

విజయవాడ: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతేడాది తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా పరామర్శ కోసం లోకేశ్‌ సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కి  వెళ్లారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ లోకేశ్‌తో పాటు  తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, అధికార ప్రతినిధి పట్టాభి, తెలుగు యువత నేత దేవినేని చందులపై పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్‌ 12న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని