గత వైభవానికితుప్పు
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

గత వైభవానికితుప్పు

- ఈనాడు, విజయవాడ

అమరావతి సెక్రటేరియట్‌ పరిసరాల్లో కాలుష్యం తగ్గించేందుకు పర్యావరణ అనుకూల బ్యాటరీ వాహనాలను గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేశారు. నడవలేని ఉద్యోగులు, సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలను గేటు నుంచి లోపలికి తీసుకెళ్లేందుకు బ్యాటరీ కార్లు ఉపయోగించేవారు. ఉద్యోగులు ఫిట్‌నెస్‌ కోసం సైకిళ్లు తొక్కేవారు. సందర్శకులు ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు సైకిళ్లపై తిరిగేవారు. ఇప్పుడు వాటిని పక్కన పడేశారు. కొన్నిటికి సీట్లు లేవు. మరికొన్ని చినిగిపోయాయి. టైర్లు ఊడదీసుకెళ్లారు. ఇలా 9 కార్లు మూలనపడగా రెండు తిప్పుతున్నారు. రూ. లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలకు కొద్దిపాటి మరమ్మతులు చేసి వినియోగించవచ్చని సందర్శకులు అంటున్నారు. మూలన పడేయడంతో ఎండకు ఎండి, వానకు తడుస్తూ తుప్పుపడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని