సీతానగరంలో జారిపడ్డ కొండరాళ్లు
eenadu telugu news
Published : 28/09/2021 03:21 IST

సీతానగరంలో జారిపడ్డ కొండరాళ్లు

రోడ్డుపై పడిన కొండరాయిని తొలగిస్తున్న సిబ్బంది

తాడేపల్లి, న్యూస్‌టుడే: నగరంలోని సీతానగరం వద్ద సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కొండ రాళ్లు జారి రోడ్డుపై పడ్డాయి. ఆ ధాటికి నగరపాలక అధికారులు రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌ ధ్వంసమైంది. ఆ సమయంలో రోడ్డుపై రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న నగరపాలక డిప్యూటీ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి సిబ్బందితో రాళ్లను తీయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సాయంత్రం డిప్యూటీ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, తహసీల్దారు శ్రీనివాసులు రెడ్డితో కలిసి కొండరాళ్లు జారిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతానగరం, కేఎల్‌రావు కాలనీ, పోలకంపాడు, తాడేపల్లిలో కొండలపై నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల సమీపంలో బండ రాళ్లు జారిపడే అవకాశం ఉంటే వెంటనే నగరపాలక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని